Shape ICTforAg Learning Network's future with us during our exclusive limited preview – your feedback drives our development!Connect with us at learningnetwork@ictforag.com
Card image cap

జొన్న విత్తన ఉత్పత్తి మరియు విత్తన భద్రత

Course Code: 119

Course Duration: 20 Minutes

Total Chapters: 5

Language: Telugu

Course Instructor : Krithika Anbazhagan

ఈ కోర్సు, జొన్న సాగుదారులు మరియు ప్రభుత్వేతర సంస్థల (NGO) సిబ్బందికి, జొన్న విత్తన ఉత్పత్తికి సహకరిస్తూ, పంటను ధాన్యంగా కాకుండా విత్తనంగా విక్రయించడానికి ఉద్దేశించబడింది. బహిరంగ పరాగసంపర్క రకాలను ఉపయోగించుకుంటూ రైతు సంఘాలు ఇతరుల మీద ఆధార పడకుండా విత్తనాలను ఉత్పత్తి చెయ్యడంలో స్వయం సమృద్ధి సాదించుకోవడానికీ ఈ కోర్సు ఎంతగానో తోడ్పడుతుంది. హైబ్రీడ్ విత్తనాల మాదిరిగా కొనుగోలు చేయకుండా, బహిరంగ పరాగసంపర్క రకాలను మనం కోత అనంతరం తదుపర సీజన్లో ఉపయోగించవచ్చు. విత్తనాలను ఉత్పత్తి చేసేటప్పుడు కొన్నికీలక పద్ధతులు అనుసరిస్థూ ఇతర విత్తనాలు కలవడం లేదని నిర్ధారించుకోవాలి, తద్వారా విత్తన స్వచ్ఛతను కాపాడుకోవడం వల్ల స్వచ్ఛమైన రకాలతో మంచి దిగుబడిని పొందవచ్చు. మిశ్రమ విత్తనాలు తరచుగా సేకరించినట్లైతే కొంత కాలానికి దిగుబడి బాగా తగ్గిపోతుంది. దీనిని నివారించడానికి, ఇతర పొలాలను వేరుచేయడం, ఇతర జొన్నరకాలను, వ్యాధి సోకిన మొక్కలను తొలగించడం చాలా ముక్యం.

Objectives

జొన్న విత్తన ఉత్పత్తి కార్యకలాపాలలో రైతులకు సహాయము చేయుట మరియు విత్తన భద్రత గురించి తెలియజేయుట.

Outcomes

రైతులు సొంతంగా విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం, రైతులు వారి నేలకు తగిన బహిరంగ పరాగసంపర్క రకాలను స్వీకరించడం, రైతులు తమ విత్తనాలను తోటి వారితో పంచుకోవడం, అధికారిక మరియు అనధికారిక మార్కెట్లలో తమ ఉత్పత్తులను విత్తనాలుగా విక్రించడం.

Assessment

No

Target Audience

Farmer, Researcher, Technicians

Keywords

seed, sorghum

Skills

Farming